Zero Progress in Polavaram in YS Jagan's First Yearకోవిడ్ విధుల్లో ఉన్న డాక్టర్లకు సరైన పీపీఏ కిట్లు లేవని ఆరోపించిన డాక్టర్ సుధాకర్ ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తరువాత ఆయనకు పిచ్చోడు అనే ముద్ర వేసి నడి రోడ్డు మీద పోలీసులతో కొట్టించింది. ఆ తరువాత ఆయనను పిచ్చాసుపత్రిలో కూడా పెట్టారు. ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ హై కోర్టుకు చేరింది.

ప్రభుత్వ ఉద్యోగిగా కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించనందునే డాక్టర్‌ సుధాకర్‌పై సస్పెన్షన్ వేటు వేశామని ప్రభుత్వం వాదనలు వినిపింది. సుధాకర్‌ శరీరంపై గాయాలున్న విషయం మేజిస్ట్రేట్‌ నివేదికలో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో గాయాల ప్రస్తావన లేదని ధర్మాసనం పేర్కొంది. ప్రభుత్వ నివేదికను నమ్మడం లేదన్న హైకోర్టు… దీని వెనుక భారీ కుట్ర ఉందని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది.

ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ… ఎనిమిది వారాలలో తమకు రిపోర్టు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు ఏపీ ప్రభుత్వం వెళ్లనుంది. న్యాయనిపుణలతో చర్చల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

తన తప్పు ఏమీ లేకపోతే సిబిఐ విచారణకు ఎందుకు ప్రభుత్వం భయపడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. నిజంగానే ఈ విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందని, అందుకే భయపడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు…. ప్రభుత్వం సుప్రీం కు వెళ్లి అక్కడ కూడా ఇదే రకమైన ఆదేశం వస్తే అది ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారుతుంది.