GHMC-Electionsఇటీవలే తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసి ఎన్నికలలో తేదీని నిర్ణయించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని చట్టంలో మార్పు చేసింది. దాన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎన్నికలు పెట్టుకునే వెసులుబాటు ఉంది. వాస్తవానికి జీహెచ్ఎంసి కాలవ్యవధి వచ్చే ఏడాది జనవరి వరకు ఉంది.

ఇటీవలే కాలంలో డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలు జరుగుతాయని మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మునిసిపల్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. భిన్నంగా కేటీఆర్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తొందర పడాల్సిన అవసరం లేదని చెప్పడం విశేషం. దీనితో ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి.

అయితే కొందరు మాత్రం ఈ వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, డిసెంబర్ 6న ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. దుబ్బాక ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధపడటానికి టైమ్ ఇవ్వకూడదని కేసీఆర్ అనుకోవడం వల్లే ఎన్నికలు త్వరగా జరుగుతాయని అంటున్నారు.

అయితే వాయిదా పడతాయి అనే వారు మాత్రం…ఆలస్యం చేస్తే ప్రజలు దుబ్బక ఫలితాన్ని మర్చిపోతారని అప్పుడు తెరాస గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని అందుకే వాయిదా వేస్తారని అంచనా వేస్తారు. ఏది ఏమైనా దీనిపై క్లారిటీ ఈ వారంలోనే రావడం ఖాయం. ఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావం చూపించే అవకాశాలు బాగా ఉన్నాయి.