Double dhamaka for balakrishna!నందమూరి నటసింహం అభిమానులకు ఈ శుక్రవారం నాడు ‘డబుల్ ధమాకా’ తగిలిందహనే చెప్పాలి. ఓ పక్కన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు, మరో పక్కన ధియేటర్లలోకి వచ్చిన “పైసా వసూల్” సినిమా… ఇలా రెండు నందమూరి అభిమానులను ఆనందంలో ముంచెత్తాయి. అయిదు పదుల వయసులో కూడా “పైసా వసూల్” సినిమాలో బాలయ్య తన అభినయంతోనే కాకుండా, గాత్రంతో కూడా అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. కొత్త రకం డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ధియేటర్లలో పలకరించారు బాలకృష్ణ.

అభిమానులకు పండగ లాంటి సినిమాగా టాక్ తెచ్చుకోవడంతో, సాధారణ ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉన్నా, ఫ్యాన్స్ కు మాత్రం ట్రీట్ లా మారింది. అలాగే మరో వైపు రాజకీయ రంగంలో… తెలుగుదేశం పార్టీ విజయఢంకా మ్రోగించడంతో అభిమానులు మరింత రెట్టించిన ఉత్సాహంతో సినిమాను చూస్తున్నారు. బహుశా ‘డబుల్ ధమాకా’కు సరైన అర్ధం ఈ శుక్రవారం నాడు ఫ్యాన్స్ కు తెలిసివచ్చేలా చేసారేమో బాలయ్య. ఇదే ఉత్సాహంతో తన తదుపరి సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసే ఉద్దేశంలో ఉన్నారు నందమూరి నటసింహం.