don-bosco-song-ravi-teja-ileana-dcruz-amar-akbar-antonyఈ నెల 16వ తేదీన విడుదల కాబోతున్న శ్రీను వైట్ల – రవితేజల “అమర్ అక్బర్ అంటోనీ” సినిమా నుండి రెండవ పాట విడుదలైంది. విరహ గీతంగా వచ్చిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ గా నిలువగా, ఫాస్ట్ బీట్ గా ప్రాసల మీద సాగుతూ రెండవ పాట రిలీజ్ అయ్యింది. రెగ్యులర్ థమన్ బాణీలో ఉన్న ఈ పాట విశ్వ సాహిత్యం అందించారు.

డాన్ బాస్కో… పని చూస్కో… ట్రై చేస్కో… దొరకను కాస్కో… అంటూ ప్రాసలతో మొదలైన ఈ పాటను రమ్య బెహ్రా, మనిషా, హరితేజ, శ్రీకృష్ణ, జస్ప్రీత్ లు ఆలపించారు. లిరికల్ వీడియోలో చూపించిన దానిని బట్టి ఈ పాటను ఇండోర్ లొకేషన్స్ లో చాలా గ్రాండ్ గా తెరకెక్కించగా, గోవా బ్యూటీ ఇలియానా బ్లాక్ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతోంది.