బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ నుండి తప్పుకుని చనిపోయిన వ్యక్తి సతీమణిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
“బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయదు. చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నాం. పోటీ చేయమని ఒత్తిడి వచ్చింది. ఏకగ్రీవం చేసుకోవాలని కోరుతున్నా,” అని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు.
అయితే చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవించడం అనేది కేవలం వంక మాత్రమేనని, ఓటమికి భయపడి జనసేన పోటీ చెయ్యడం లేదని చాలా మంది అభిప్రాయం. ఈ తరుణంలో తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీకి టిటిడిపి సై అంటుంది.
టీడీపీ విద్యార్థి విభాగం ,టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు పర్లపల్లి రవీందర్ పేరు పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కనీసం ఉనికి లేదు. గెలుపు పై ఎటువంటి ఆశలు లేవు. అయితే పోటీ చేస్తే క్యాడర్ ఎంతో కొంత యాక్టీవ్ గా ఉంటుంది.
పార్టీ బ్రతికి ఉందని సంకేతాలు వెళ్తాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కీలకమైన రాజకీయ పార్టీ. 2024 ఎన్నికలలో అధికారంలోకి వస్తాం అనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది. తెలంగాణలో పెద్దగా ఆశలు ఆశయాలు లేని టీడీపీ పార్టీ ఓటమికి భయపడకుండా పోటీ చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ ధైర్యం చెయ్యకపోవడమేంటో?