dmdk-vijayakanth-slaps-on-his-party-memberడీఎండీకే అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కు మళ్లీ కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోతూ, అందరి ముందూ ఓ కార్యకర్త చెంపను ఛెళ్లుమనిపించారు. ఇంతకూ ఆ కార్యకర్త చేసిన తప్పేంటంటే… ‘జిందాబాద్’ బదులు ‘వర్ధిల్లాలి’ అని టంగ్ స్లిప్ అవడమే. తమిళనాడులోని పెరంబళూరులో డీఎండీకే ఆధ్వర్యంలో ‘మీతో నేను’ అనే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విజయకాంత్ సహా పార్టీ స్థానిక నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను విజయకాంత్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వేదిక దిగి బయటకు వస్తుండగా… ఓ కార్యకర్త ‘విజయకాంత్ వర్దిల్లాలి’ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఆ కార్యకర్త చెంపను ఛెళ్లుమనిపించారు విజయకాంత్.