dk-shivakumar-master-strategist-behind-congressఅనేక నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించి ఆ తరువాత స్పీకర్ లెక్కగట్టే ముందే తాను రాజీనామా చేస్తునట్టు ప్రకటించి గవర్నర్ ను కలవడానికి రాజభవన్ కు వెళ్లారు.

అంతకు ముందు యెడ్డీ బలపరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో వరుస ఆడియో టేపులతో కాంగ్రెస్‌ సంచలనం సృష్టించింది. పలువురు భాజపా నేతలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు పలు ఆడియో సీడీలను విడుదల చేసిన కాంగ్రెస్‌ చివరికి ఏకంగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప తమ ఎమ్మెల్యేతో మాట్లాడిన సంభాషణలను విడుదల చేసింది.

దీనితో బీజేపీ పట్టు జారిపోయింది. అప్పటిదాకా బీజేపీకి మద్దత్తు ఇచ్చిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ క్యాంపుకు వచ్చేసారు. ఇంక చేసేది ఏమీ లేక రాజీనామా చేసారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారకుండా చేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా మాజీ మంత్రి డీకె శివకుమార్ దే. బీజేపీ అంగబలం, అర్ధబలంను ఎదురుకుని ఎమ్మెల్యేలను కాపాడటం అంత తేలికైన విషయమైతే కాదు.