distributors about vakeel saab movie price hikeవకీల్ సాబ్ సినిమా మీద పంతంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన జీవో చిన్న సినిమా థియేటర్ల పాలిట మరణశాసనంగా మారేలా ఉంది. మొదటి వారాంతం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సీ సెంటర్ థియేటర్లు స్వచ్ఛందంగా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2011లో ని రేట్లతో ప్రభుత్వం కొత్త జీవో తెచ్చి అదే రేట్లకు అమ్మమంటుంది ప్రభుత్వం.

ఆ జీవో ప్రకారం గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే ఏసీ థియేటర్లు 20,15,10 రూపాయిల టిక్కెట్లు అమ్మాలి. ఇటీవలే కాలంలో ప్రొజెక్షన్ల కనీ, సౌండ్ సిస్టంల కనీ భారీ గా ఖర్చుపెట్టారు థియేటర్ల ఓనర్లు. ఆ విషయం కూడా పక్కన పెడితే ఆ రేట్ల మీద థియేటర్లు ఫుల్ అయినా కనీసం మైంటెనెన్సు కూడా రాదని మొత్తానికి థియేటర్లు మూసి వేశారు.

“పంచాయతీలకింత, మునిసిపాలిటీలకింత, సిటీలకు ఇంత అని ప్రభుత్వం రేట్లు పెడుతుంది సరే… కరెంటు ఛార్జీలు కూడా ఆ విధంగానే వసూలు చేస్తుందా? 2011 నుండి ప్రభుత్వం మా నుండి వసూలు చేసే పన్నులు పెంచలేదా? ఇదే పరిస్థితి కొనసాగితే మా పెళ్ళాంపిల్లలతో రోడ్డున పడాలి మేమంతా,” అని వారు వాపోతున్నారు.

“జగనన్న వినోద భరోసా అని పథకం పెట్టుకుని పావలాకు అర్ధరూపాయికి సినిమాలు వెయ్యండి… లక్షలు పెట్టి థియేటర్లు పెట్టుకున్న మమల్ని రోడ్డున పడేయకండి. మా పెట్టుబడి మాకు ఇచ్చేసి మా థియేటర్లు కూడా తీసేసుకోండి. మా పెళ్ళాంపిల్లలు రోడ్డు మీద పడాలి ఇప్పుడు. మీ రాజకీయాల కోసం మమ్మల్ని బలిచెయ్యకండి,” అని విజయనగరం జిల్లాలో ఈరోజు పూర్తిగా మూతపడిన ఒక సీ సెంటర్ యజమాని ఆవేదన.