'స్పెషల్' ఫ్రీక్వెల్ లో మజా లేదు!ప్రేక్షకులకు వెబ్ సిరీస్ లపై మక్కువ పెంచిన కధలలో “స్పెషల్ ఓపీఎస్”ది ఓ ప్రత్యేకమైన స్థానం. ఇండియాలో ఉన్న ‘రా’ ఏజెంట్స్ పాకిస్తాన్ వంటి దేశాలలో ఏ విధంగా పని చేస్తారో, అండర్ కవర్ ఆపరేషన్స్ ఎలా నిర్వహిస్తారో… అన్న దానిని అద్భుతంగా తెరకెక్కించడంతో ‘స్పెషల్ ఓపీఎస్’ సిరీస్ ఇండియాలో సూపర్ హిట్ అయ్యింది.

తాజాగా ఈ సిరీస్ కు ప్రీక్వెల్ “స్పెషల్ ఓపీఎస్ 1.5” పేరుతో విడుదలైంది. మొదటి సిరీస్ లో అనేక అండర్ కవర్ ఆపరేషన్స్ ను విజయవంతంగా నిర్వహించిన హిమ్మత్ సింగ్ ఫ్లాష్ బ్యాక్ తదితర అంశాలతో ఈ ప్రీక్వెల్ రూపొందింది. అయితే మొదటి సీజన్ ఇచ్చినంత కిక్ ను ఈ 1.5 సీజన్ ఇవ్వలేదన్నది వీక్షకుల మాట.

దీనికి కారణం… అనేక అనేక ఆపరేషన్స్ ను వెంటవెంటనే స్క్రీన్ పై చూపించడంతో, ప్రేక్షకులకు గందరగోళంగా మారింది. ఒక లైన్ నుండి మరొక లైన్ ను అర్ధం చేసుకోవడానికి తికమక పడాల్సిన పరిస్థితి ప్రేక్షకుల వంతయ్యింది. అయితే మొదటి సీజన్ కు వచ్చిన క్రేజ్ తో ఈ 4 ఎపిసోడ్ల 1.5 సీజన్ చూడడానికి పెద్దగా ఇబ్బంది అనిపించదు.