Disco Raja Teaser 2 Talkమాస్ మహారాజా రవితేజ నటిస్తున్న డిస్కో రాజా రెండో టీజర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. మొదటి టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రెండో టీజర్ పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే టీజర్ వాటిని అందుకునేలానే ఉన్నాయి. టీజర్ డిఫరెంట్ గా స్టైలిష్ గా ఉంది. రవితేజ కూడా చాలా కాలం తరువాత ఫ్రెష్ గా కనిపించారు.

అదే సమయంలో రవితేజ ఎనర్జిటిక్ గా కూడా ఉన్నారు. తమిళ నటుడు బాబీ సింహా ఈ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. ట్రైలర్ లో ఆయన క్యారెక్టర్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్ లో ఉన్న థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. టీజర్ లోని విజువల్స్ లావిష్ గా కూడా ఉన్నాయి.

వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓ సైఫై థ్రిల్లర్‌గా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సత్య, సునీల్, రామ్‌కీ తదితరులు నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఈనెల 24వ తేదీన గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది సినిమా యూనిట్.

డిస్కోరాజా సినిమా ప్రస్తుతం రవితేజకు ఎంతో కీలకం. ఆయన గత మూడు చిత్రాలు టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటొని ఘోరంగా విఫలమయ్యాయి. ఆయన పుంజుకోవాలంటే డిస్కోరాజా హిట్టు కావడం చాలా అవసరం. మరి… రవితేజకు ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.