Director VV Vinayak - homeopathy medicine to his villageడైరెక్టర్ వీవీ వినాయక్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వర్థిల్లి ఇప్పుడు వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. మొన్న ఆ మధ్య హీరోగా సైతం ఒక సినిమా మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా ఆయన చిరంజీవితో లూసిఫర్ రీమేక్ చేస్తారని, ఆ పనులలో బిజీగా ఉన్నారని వార్తలు వచ్చాయి.

ఇక అసలు విషయానికి వస్తే… వినాయక్ ఈ మధ్యన ఒక హోమియో డాక్టర్ ని కలిశారట. తనను చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యను ఆయన చిటికిలో పరిష్కారించారట. దానితో ఆయనకు హోమియో మీద వెంటనే గురి కుదిరిందట. దీనితో వారి ఊరికి కరోనా రాకుండా ఆ డాక్టర్ తయారు చేసిన మందు 30,000 డోసులు పంపారట వినాయక్.

“ప్రసాద్ రెడ్డి గారి సహకారంతో 30,000 డోసుల హోమియో మెడిసిన్ మా ఊరికి పంపగలిగాను,” అని వినాయక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీని కోసమే సుమారుగా పది లక్షలు ఖర్చుపెట్టారట. ఆ మందు వాడాకా తమ ఊరిలోని పాజిటివ్ కేసులు చాలా వరకు కంట్రోల్ అయ్యాయని వినాయక్ చెప్పడం విశేషం.

హోమియో వైద్యం గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆ మందును గానీ, డాక్టర్ ని గానీ ప్రమోట్ చేసే ఉద్దేశం లేకపోయినా తమ ఊరి వారి గురించి అంతగా అలోచించి వెంటనే పది లక్షలు ఖర్చుపెట్టిన వినాయక్ ని మాత్రం అభినందించకుండా ఉండలేము.