Nagarjuna - Director Vikramఅక్కినేని కుటుంబానికి – దర్శకుడు విక్రమ్ కే కుమార్ కు ఓ ప్రత్యేకమైన అనుబంధం “మనం” చిత్రం ద్వారా ఏర్పడిందన్న విషయం తెలియనిది కాదు. ఈ తరంలో ‘క్లాసిక్’ చిత్రాలను లెక్కలోకి తీసుకుంటే… అందులో మొదటి వరుసలో ఉండే చిత్రంగా “మనం” నిలుస్తుంది. ముఖ్యంగా ఏఎన్నార్ కు సరైన సెండాఫ్ ఇచ్చిన చిత్రంగా “మనం” చిరస్థాయిగా నిలిచిపోవడంతో, అక్కినేని ఫ్యామిలీకి – విక్రమ్ కు మధ్య ‘బాండింగ్’ బాగా ఏర్పడిపోయింది.

ఆ అనుబంధంతోనే అఖిల్ తో “హలో” సినిమా చేసారు. ఈ సినిమా అలా పూర్తయ్యిందో లేదో విక్రమ్ తో మరో సినిమాకు నాగ్ కమిట్ చేయించేసారు. అవును… చైతూకు సోలో హిట్ కావాల్సి ఉండడంతో… ఆ లోటును విక్రమ్ అయితే సరిగ్గా భర్తీ చేయగలరని భావించిన నాగార్జున, అశేష అభిమానుల ముందు విక్రమ్ ను చైతూ సినిమాకు కమిట్ చేయించేసాడు. నిజానికి ఇటీవల ముగిసిన ఓ ప్రెస్ మీట్ లో విక్రమ్ – చైతూల సినిమా గురించి నాగ్ స్పష్టంగా ఓ ప్రకటన చేసారు.

కానీ, తాజా ఆడియో వేడుకపై తన సైడ్ నుండి కాక, విక్రమ్ సైడ్ నుండి కూడా ఈ సినిమాను ఓకే చేయించాలని, లేచి నిల్చోని అభిమానులు అభివాదం చేస్తూ… చైతూ చిత్రం కమిట్ అయినట్లుగా చెప్పాలని సూచించారు. నాగ్ అంతటి వ్యక్తి చెప్పడంతో, ఇష్టంగానో, అయిష్టంగానో పైకి లేచిన విక్రమ్, ఫ్యాన్స్ కు చేతులు ఊపుతూ చైతూ చిత్రానికి గ్యారెంటీ ఇచ్చారు. అయితే విక్రమ్ ను పైకి నిల్చోమని మరీ చెప్పి ఇంతలా కమిట్ చేయించాలా..? అని ఈ ఎపిసోడ్ చూసిన వారి వంతవుతోంది.