Trivikram A... Aa‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ – ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్ కున్న క్రేజ్ తెలియనిది కాదు. రెండు సినిమాలు వీరి కాంభినేషన్ లో రాగా, ఒకటి సక్సెస్, మరొకటి ఫెయిల్ అయినప్పటికీ, రెండు సినిమాలు కూడా అభిమానులకు అత్యంత ప్రీతిపాత్రమైన సినిమాలుగా మారాయి. దీంతో వీరిద్దరి జోడి కోసం అభిమానులే కాదు, సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ 25వ సినిమాకు త్రివిక్రమ్ కలవబోతున్నారన్న సమాచారంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది గానీ, అంతకంటే ముందుగా వీరిద్దరూ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు.

సినిమాలతో పాటు యాడ్ రంగంలో మహేష్, త్రివిక్రమ్ లకు ఉన్న క్రేజ్ తెలియనిది కాదు. ఇప్పటికే రెండు అంకెలను దాటిన మహేష్ ఖాతాలో మరొకటి వచ్చి చేరింది. దాని కోసమే ఈ ఇద్దరూ మళ్ళీ కలిసారు. ఆన్ లైన్ బస్ బుకింగ్ రంగంలో ముందంజలో ఉన్న ‘అభిబస్.కాం’కు ప్రిన్స్ ప్రచారకర్తగా అంగీకారం తెలపడంతో, దీనికి సంబంధించిన యాడ్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ అడ్వర్టైజ్మెంట్ చిత్రీకరణ జరుపుకుంటోంది. గతంలో మహేష్ – త్రివిక్రమ్ ల కలయికలో ‘జోస్ అలుక్కాస్’ వంటి స్టైలిష్ యాడ్ లు ఎన్నో చిత్రీకరించిన విషయం తెలిసిందే.