Director Sukumar nex movie with nithin reddyటాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, ఎందరో కుర్ర హీరోలకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు. అయితే తాజగా రంగస్థలం సినిమాతో మరో మారు తన టాలెంట్ ను ప్రేక్షకులకు చూపించాడు సుకుమార్. అయితే సుకుమార్ దర్శకుడిగానే కానీ, నిర్మాతగా కూడా మంచి సక్సెస్ కలిగిన నిర్మాత.

ఇదిలా ఉంటే మరో పక్క సుకుమార్ ఇప్పటికే కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి హిట్ అందుకుని ఉన్నాడు. ఇదే కోవలో మరో మారు తన బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమాని యువ హీరో నితిన్ తో చేయనున్నాడు. దాదాపుగా వరుస ఫ్లాప్స్ తర్వాత హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత కొన్ని సినిమాలు పర్వాలేదు అని అనిపించినా, మళ్ళీ వరుసగా ఫ్లాప్స్ బాట పట్టి, హ్యాట్రిక్ ఫ్లాప్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు నితిన్ కి హిట్ అవసరం. అయితే ఆ క్రమంలోనే సుకుమార్ నే నమ్ముకున్నాడు నితిన్.

ఇక ఇక్కడ సుకుమార్ చెప్పిన కథ నితిన్ మ్యానరిజానికి పూర్తి విరుద్ధంగా ఉన్నా, మరో పక్క ఇది పూర్తి ప్రయోగం అయినా, సుకుమార్ ఎలా అంటే ఆలా అంటున్నాడు నితిన్. మరి రామ్ చరణ్ లాంటి హీరోలో యాక్టింగ్ కోణాన్ని వెలికి తీసి చెర్రీ ఇమేజ్ ను మరింత పెంచిన సుకుమార్ ఈసారి ఆ అవకాశాన్ని నితిన్ కి ఇస్తాడు అని అనుకోవచ్చు. మరి చూద్దాం ఈ సినిమా నితిన్ కి ఎలాంటి అనుభవాన్ని అందిస్తుందో.