Director Sukumarడైరెక్టర్ సుకుమార్ తన సొంత ఊరైన మట్టపర్రు (తూర్పు గోదావరి జిల్లా) కు ఏదైనా చెయ్యాలని సంకల్పించారు. సినిమాల్లోకి రాకముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సుకుమార్ మట్టపర్రు గ్రామం లో పాఠశాలకు కొత్త భవనం నిర్మించతలపెట్టారు. తన తండ్రి తిరుపతి రావు నాయుడు గారు పేరు మీద రెండు అంతస్తుల పాఠశాల భవనం నిర్మాణం చేయుటకు నిర్ణయం తీసుకున్నారు.

దీనికి అయ్యే ఖర్చు సుమారుగా 14 లక్షల రూపాయలు వ్యయం తో నిర్మిస్తున్నారు. నిర్మాణం వేగంగా సాగుతుంది. స్కూళ్ళు తీర్చుకునే నాటికి దాని నిర్మాణం పూర్తి చెయ్యాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా… సుకుమార్ తన తదుపరి చిత్రం పుష్ప షూటింగ్ మొదలుపెట్టడానికి ఎదురు చూస్తున్నారు.

కరోనా కేసులు కొంచెం తగ్గితే షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. పుష్ప సుకుమార్ యొక్క మొదటి పాన్-ఇండియా ప్రాజెక్ట్ మరియు ఇందులో అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు.

శేషచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ చిత్రం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడటానికి పాఠాలు కూడా నేర్చుకున్నాడు.