Director Sukumar Jyo Achyutananda Movie, Director Sukumar Srinivas Avasarala Jyo Achyutananda Movie, Director Sukumar Jyo Achyutananda Movie Storyదర్శకత్వం వహించిన తొలి చిత్రం “ఊహలు గుసగుసలాడే” సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన రెండవ సినిమా “జ్యో అచ్యుతానంద” 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్తదనంతో కూడిన ఈ సినిమా ట్రైలర్ సినీ అభిమానులను అలరించడంతో, పాజిటివ్ బజ్ తో విడుదల అవుతోంది. అయితే ఈ సినిమాపై క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చేసిన వ్యాఖ్యలు అంచనాలను మరింత పెంచుతున్నాయి.

‘ఒక ప్రేమ కధను ఇంత థ్రిల్లింగ్ గా చెప్పవచ్చా’ అనే రీతిలో ఈ స్క్రిప్ట్ ఉందని, ‘మేకింగ్ లో ఉన్నపుడే స్క్రిప్ట్ తెప్పించుకుని మొత్తం చదివానని, సినిమా అంతా కామెడీగా, సరదాగా అనిపించిన స్క్రిప్ట్ క్లైమాక్స్ కు వెళ్ళేపాటికి ఏడిపించిందని, ఈ అనుభూతిని ఎలా తెలియజేయాలో తెలియక, కన్నీళ్ళతో కూడుకున్న తన కళ్ళను ఫోటో తీసి శ్రీనివాస్ కు పంపించానని’ సుకుమార్ చెప్పిన సంగతులు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాను వరుసగా మూడు షోలు చూశానని, అంతగా ఆ సినిమా నచ్చేసిందని, ఈ సినిమా స్క్రిప్ట్ చదివిన తర్వాత కూడా అంతే విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందని, కొత్తదనంతో నిండుకుని ఉన్న కధలను నిర్మించడంలో నిర్మాత సాయి కొర్రపాటి సిద్ధహస్తులుగా మారారని, కళ్యాణ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అని చిత్ర యూనిట్ కు ముందస్తుగా అభినందనలు తెలిపారు.