Director-sujeeth-singhరెండో సినిమాకే ప్రభాస్ తో సినిమా వచ్చింది సుజీత్ కు. అది కూడా బాహుబలి వంటి అతిపెద్ద హిట్ కొట్టాకా ప్రభాస్ తో సినిమా అంటే మాములు విషయం కాదు. ఆ సినిమానే సాహో. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సుజీత్ కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ సందర్భంగా అందరూ శంకర్-ఎహశాన్-లాయ్ ను ఎందుకు తప్పించారనే విషయంపైనే ప్రశ్నలు సంధించారు. అప్పట్లో డైరెక్టర్ తో సరిపడకే వారు తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

“ఒకే సినిమాకు పలువురు సంగీత దర్శకులు పనిచేయడం నేను కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఈ పద్ధతి ఉంది. ఒకే మ్యూజిక్ డైరక్టర్ ఉంటే సినిమాలో ఫీల్ క్యారీ అవుతుందనేది నేను నమ్మను. ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక్కో సీన్ కు ఒక్కొక్కరు చేస్తే భయపడాలి. అలా చేస్తే ఫీల్ మారిపోతుంది. సాంగ్స్ విషయంలో ఆ బాధ లేదు. నిజానికి ఇలా డిఫరెంట్ మ్యూజిక్ డైరక్టర్లతో వెళ్లాలని అనుకోలేదు. అదలా జరిగిపోయిందంతే. ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడు చేయడం వల్ల పని కూడా ఫాస్ట్ గా అవుతుంది కదా,” అని చెప్పుకొచ్చాడు.

ఆ విషయం పై స్పందించినా అసలు విషయం మీద మాట్లాడకుండా తెలివిగా సమాధానం చెప్పాడు. ఒక సంగీత దర్శకుడితో పని చేసినా ఎక్కువ మందితో పని చేసినా అది పెద్ద విషయం కాదు. కాకపోతే శంకర్-ఎహశాన్-లాయ్ ఈ సినిమా కోసం ఏడాది పని చేసి తప్పుకున్నారంటే అది తప్పకుండా విషయమే. దాని మీద సమాధానం చెప్పకుండా దాట వేశాడు సుజీత్. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై దేశవ్యాప్తంగా ట్రేడ్, ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.