Director Shankar - Director Rajamouliటాలీవుడ్ సర్కిల్స్ నుంచి తాజాగా వినిపిస్తున్న కధనం ప్రకారం రాజమౌళి #RRR షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వస్తుంది.

అదేంటి అంటే ఈ సినిమా సాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ మొత్తాన్ని ఒక ప్రముఖ టీవీ ఛానెల్ ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 132 కోట్లకు కొనుక్కుందట. కట్ చేస్తే సౌత్ ఇండియా లోనే అంత భారీ రేట్ కి అమ్మడైన సినిమాగా ఈ సినిమా రికార్డు కెక్కినట్లే.

ఎందుకంటే తాజాగా శంకర్ తీసిన రోబో-2 కూడా అన్ని భాషల్లో కలిపి సాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ 108 రేటు పలికిందట. అంటే రోబోతో పోలిస్తే రాజమౌళి సినిమా టాప్ ప్లేస్ లో నిలబడ్డట్లే.

ఇక మరో పక్క ఈ మ్యాటర్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో యధావిధిగా రాజమౌళీ vs శంకర్ అంటూ రచ్చ మొదలయ్యింది. ఇక ఇదిలా ఉంటే ఇక్కడ ఈ సినిమాలో ఉన్న విశేషమే ఈ భారీ డిమాండ్ కి కారణం అని స్పష్టంగా చెప్పవచ్చు.

అదేంటి అంటే ఒకటి బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా కావడం, మరో పక్క యువ మాస్ హీరోలు ఎన్ఠీఆర్, మరియు చరణ్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తూ ఉండడం. మొత్తంగా ఈ ముగ్గురు కలసి రచ్చ రంబోలా చెయ్యడం ఖాయంగానే కనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.