Director Shankar chooses Anirudh for indian 2 instead of AR Rahmanశంకర్ సినిమా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది టెక్నికల్ వాల్యూస్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే సినిమా ఎంత రిచ్ గా కనిపిస్తే అంత హిట్ అవుతుంది అన్నది శంకర్ ఆలోచన. అతిశయోక్తి అని అనుకోకపోతే శంకర్ ఒక్క పాటకు పెట్టే ఖర్చుతో రెండు చిన్న సినిమాలు తీసెయ్యొచ్చు…తెలుసా.

అంటే పాటలకు తన సినిమాలో శంకర్ అంతటి ప్రాధాన్యత ఇస్తాడు. ఇక షరా మామూలుగా శంకర్ ఎప్పుడూ తన సినిమాలో ఏ. ఆర్.రెహ్మాన్ ను వదలడు. కానీ కమల్ ప్రతిష్టాత్మక సినిమా అయిన ఇండియన్-2 లో మాత్రం రెహ్మాన్ ను పక్కన పెట్టేసాడు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా దీనిపైనే చర్చించుకుంటుంది. ఎందుకు శంకర్ రెహ్మాన్ ను కాదని అనిరుద్ ని తెరపైకి తెచ్చాడు?

శంకర్ కి రెహ్మాన్ కి మధ్య ఏమైనా మనస్పద్దలు వచ్చాయా? లేక రోబో 2 .0 సినిమాకు రెహ్మాన్ సరైన అవుట్ ఫుట్ ఇవ్వలేదు అని శంకర్ ఏమైనా ఫీల్ అయ్యాడా? లేక రెహ్మాన్ మ్యూజిక్ లో పస తగ్గింది అని పక్కన పెట్టేసాడా? ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాకి శంకర్ రెహ్మాన్ ను కాదనడం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉంది అన్నది శంకర్ ఫాన్స్ ఆలోచన.

అయితే నిజం ఏదైనా…అనిరుద్ కి మాత్రం ఇది మంచి అవకాశం…!మరి ఉపయోగించుకుంటాడో..లేక అజ్ఞాతవాసిలాగా పాడు చేసుకుంటాడో చూద్దాం.