Puri jagannadh tweet picదర్శకులలో పూరీ జగన్నాధ్ శైలి వేరు. ‘తక్కువ’ సమయంలో ‘ఎక్కువ’ హీరోయిజం చూపించగల దర్శకులలో పూరీదే అగ్రస్థానం. అలా తనకంటూ ఓ మార్క్ వేసుకున్న పూరీ, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోనూ బాగానే సందడి చేస్తున్నారు. అందులో భాగంగానే పూరీ చేసిన ఓ తాజా ట్వీట్ కు నెటిజన్లు ‘సలాం’ కొడుతున్నారు.

“ప్లేట్లు నోటికి కరిపించుకుని వరుసగా కూర్చుని ఉన్న కుక్కల” ఫోటోను షేర్ చేస్తూ ‘క్రమశిక్షణ గల పోలీస్ కుక్కలు’ అంటూ చేసిన ట్వీట్ కు నెటిజన్ల నుండి ‘లైక్’ల వెల్లువ వస్తోంది. మనుషులకు లేని క్రమశిక్షణ కుక్కలలో ఉందని ఈ ఫోటో చాటిచెప్తోందని ‘పెట్ ప్రియులు’ అంటుంటే… మనుషుల అద్భుతమైన శిక్షణకు నిర్వచనం అని మరికొందరు అంటున్నారు.

ఏది ఏమైనా పూరీ మార్క్ ఫోటో ఇది… నువ్వు కేకేహే… అని పూరీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే పూరీ కూడా ‘పెట్ ప్రియుడు’ అన్న విషయం తెలిసిందే. గతేడాది జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ‘టెంపర్’ సినిమాలో కూడా కాజల్ పాత్ర ద్వారా కుక్కలపై తనకున్న అభిమానాన్ని పూరీ చాటిచెప్పిన విషయం తెలిసిందే.