Director Prashant Varma Like to direct Balakrishnaఅ! వంటి విభిన్నమైన సినిమాతో డైరెక్టరుగా అరంగేట్రం చేసిన ప్రశాంత్ వర్మ తెలుగు సినిమాలో ఉన్న యువ దర్శకులలో ప్రామిసింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రాజశేఖర్ తో కల్కి అనే సినిమా చూస్తున్నారు. ఇప్పటిదాకా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లు అన్నీ విభిన్నంగా ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. చూడబోతే ఈ యువదర్శకుడు ఇంకో హిట్ కొట్టేలానే ఉన్నాడు. కల్కి ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధం అవుతుంది.

ఈ చిత్ర ప్రొమోషన్ల లో భాగంగా దర్శకుడు నందమూరి బాలకృష్ణ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. “బాలకృష్ణ గారు అద్భుతమైన నటుడు. కేరీర్ ఆరంభంలో ఎన్నో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేశారు. అయితే ఈ మధ్య ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయారు. ఫ్యాన్స్ వల్ల కావొచ్చు. నా దగ్గర ఆయన కోసం ఒక క్రేజీ స్క్రిప్టు ఉంది. ఇప్పటివరకూ ఆయన చెయ్యనిది. తెలుగు సినిమాలో రానిది. ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చేస్తా,” అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.

దీనితో అభిమానులు ఈ సినిమా జరగాలని కోరుకుంటున్నారు. అయితే బాలయ్య ఈ వయసులో ఆ సాహసం చేస్తాడా? అనేది చూడాలి. బాలయ్య వచ్చే నెలలో తన జైసింహా దర్శకుడు కెఎస్ రవికుమార్ తో ఒక సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా బాలయ్య తన 2014 మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలవడం విశేషం.