director pavan sadinen about nara rohithపవన్ సాదినేని దర్శకత్వంలో నారా రోహిత్, నందిత హీరోహీరోయిన్లుగా నటించిన “సావిత్రి” సినిమా ఏప్రిల్ 1వ తేదీన విడుదలకు సిద్ధమైంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్న నేపధ్యంలో ఈ చిత్ర దర్శకుడు “సావిత్రి” అనుభూతులను పంచుకున్నారు. ఈ టైటిల్ కు వినగానే ‘క్లాస్’ అనిపించినా, తనకు మాత్రం మాంచి మాస్ అప్పీల్ ఉన్న టైటిల్ గా భావించానని, హీరోయిన్ సావిత్రిని మించిన హీరోయిన్ మాస్ లో ఎవరున్నారని తనదైన రీతిలో చెప్పుకొచ్చారు పవన్.

అయితే మొదటగా నారా రోహిత్ కు వినిపించిన స్క్రిప్ట్ ఇది కాదని, ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని, అయితే అలాంటి కధలు ఇప్పటికే చేసి ఉన్నానని, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం వేచిచూస్తున్నానని చెప్పడంతో… తానొక విషయం చెప్పానని అన్నారు. ఒక స్టోరీ ఉంది… అందులో మొదట పదిహేను నిముషాల పాటు హీరో అసలు కనపడడని, కేవలం పాత్రలే కనిపిస్తాయని చెప్పాక… సినిమాలో మొత్తం నేనే ఉండాలి, కధంతా నా చుట్టూనే తిరగాలి అనే టైపు నేను కాదని చెప్పడంతో “సావిత్రి” కధను రోహిత్ కు చెప్పానని, అలా ప్రారంభమైందని అన్నారు దర్శకులు.

ఇక, హీరోయిన్ నందిత కూడా తొలుత టైటిల్ విని, సినిమా చేయను అన్నారని, తర్వాత కధ విన్నాక ఒక అన్నారని, ఒక పెళ్లి చుట్టూ తిరిగే కధ ఈ ‘సావిత్రి’ అని, ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు ఈ ‘ప్రేమ ఇష్క్ కాదల్’ దర్శకుడు పవన్ సాదినేని.