Top Dialogue Writer Director Parasuram, Director Parasuram, Puri, Trivikram Top 3  Dialogue Writers Tollywood, Director Parasuram Superb Writing Skill‘సోలో’తో సూపర్ హిట్ అందుకున్న తర్వాత ‘సారొచ్చారు’తో కాస్త వెనుకబడ్డ పరశురాం, తాజాగా అల్లు శిరీష్ తో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒక దర్శకుడిగానే కాక, రచయితగా డైలాగ్స్ అందించిన పరశురాంకు అభినందనల వెల్లువ వస్తోంది. ఎ విషయమే… త్రివిక్రమ్, పూరీల తర్వాత డైలాగ్స్ రాయాలంటే మీరే అంటున్నారు అని మీడియా ప్రతినిధి చెప్పిన విషయానికి… వాళ్ళు భగవంతులు… మనం భక్తులం అంతే… అంత తేడా ఉంది అంటూ ఒక్క మాటలో విశదీకరించాడు.

తన డైలాగ్స్ చాలా సింపుల్ గా, సహజత్వంగా ఉండడానికి ప్రయత్నిస్తానని, డైలాగ్స్ కోసం అదే పనిగా కూర్చుని వర్కౌట్ చేయనని, ఆ సందర్భం అనుగుణంగా ఏదొకటి ఎక్స్ ప్రెస్ చేయాలి కాబట్టి రాసుకుంటాను తప్ప, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోవడానికి డైలాగ్స్ రాయనని, సీన్ తీసే ముందు రోజు వరకు కూడా డైలాగ్స్ ని రాయను, అంతా ట్రీట్మెంట్ లో ఉంటుంది, ప్రొడక్షన్ వాళ్ళ క్లారిటీ కోసం సెట్ కెళ్ళే ముందు రోజు మాత్రమే రాస్తాను… అంటూ డైలాగ్స్ రాసే విధానం గురించి చెప్పుకొచ్చాడు పరశురాం.

చిరంజీవి గారు సినిమా చూసి వచ్చి ‘బొమ్మరిల్లు’ లాంటి సినిమా తీసావని అభినందించారని, తనపై తన గురువుల ప్రభావం పూరీ జగన్నాధ్, బొమ్మరిల్లు భాస్కర్, వీరూ పోట్ల, దశరథ్ ల ప్రభావం ఉంటుందన్న విషయం తెలుసని అభిప్రాయ పడ్డారు. తన తదుపరి సినిమా కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటుందని, అయితే హీరో ఎవరన్న విషయం అల్లు అరవింద్ గారే చెప్తారని అన్నారు ఈ ‘సోలో’ దర్శకుడు.