director maruthi about his friendship with allu arjun‘ఈ రోజుల్లో’ సినిమాతో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సృష్టించిన దర్శకనిర్మాత మారుతీ అంటే తెలియని వారుండరు. కెరీర్ తొలినాళ్ళల్లో వరుసగా బూతు చిత్రాలు చేస్తున్నారని పేరు గడించిన మారుతీ లైఫ్ ను ‘భలే భలే మగాడివోయ్’ సినిమా కీలక మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ వంటి సీనియర్ హీరోతో “బాబు బంగారం” వంటి పెద్ద సినిమా అవకాశం మారుతీకి దక్కింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందనుకోండి… అది వేరే విషయం..!

పెద్ద సినిమాలకు వచ్చేపాటికి అన్ని అంశాలను పరిశీలనలోకి తెరకెక్కించాల్సి ఉంటుందని, అదే చిన్న సినిమాలకు వచ్చే పాటికి ఎలాంటి ఒత్తిడి లేకుండా మనం అనుకున్నది తీయగలుగుతామని, అందుకే చిన్న సినిమాలతో సక్సెస్ కొట్టిన దర్శకులు పెద్ద సినిమాలతో విజయాలు అందుకోలేకపోయారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మారుతీ అభిప్రాయ పడ్డారు. అలా కాకుండా తాను రాసుకున్న కధకు ఎవరు హీరోగా ఉండాలి అని తాను అనుకుంటే… ఆ లెక్కలు వేరేగా ఉంటాయని తెలిపారు.

తాను కెరీర్ లో నిదానంగా ఎదగాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను గానీ, ఒక్కసారే పెద్దవాడ్ని అయిపోవాలి, కోట్లకు కోట్లు సంపాదించుకోవాలని అనుకోవడం లేదని, అదే అయితే తన స్నేహితుడు బన్నీ ఎన్నో సార్లు తనకు ఓ కధ రాయమని అడిగాడని, కానీ ఫ్రెండ్ షిప్ ను అడ్డం పెట్టుకుని తాను సినిమాకు కమిట్ కానని, నిజంగా బన్నీకి కధ చెప్పాలని డిమాండ్ చేస్తే వెళ్ళి చెప్తాను గానీ, బన్నీ అడిగాడని కధ రాయడం తన దృష్టిలో సముచితం కాదని చెప్పుకొచ్చారు మారుతీ. ఈ లాజిక్స్ వాడుతున్నారు కాబట్టే… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గా మారుతీ ఇండస్ట్రీలో నిలబడ్డారు. ఏమంటారు…?!