director Luca Guadagnino touches private parts of Dakota Johnson‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించిన డకోటా జాన్సన్ అంటే తెలియని హాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు. అలాగే ఈ సినిమా వీక్షించిన ఇండియన్ ప్రేక్షకులకు కూడా డకోటా అంటే సుపరిచితమే. ఈ సిరీస్ లో రెండు సినిమాలు విడుదల కాగా, రెండింటిలోనూ డకోటా చేసిన నగ్న దృశ్యాలు వీక్షకులను విపరీతంగా అలరించి, ఆమెను ఓవర్ నైట్ స్టార్ ను చేసాయి.

ఈ బ్యూటీ తాజాగా వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో వైట్ గౌన్ తో రెడ్ కార్పెట్ పై నడువగా… ఈ వేడుకలో నిర్మాత మైఖేల్ డే లూకా ఆమె ఛాతి పైన చేతులు వేయడం… వాటిని కెమెరాలు క్లిక్ చేయడం… అంతిమంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం అలా జరిగిపోయాయి. ఆమె డ్రెస్ క్రిందకి జారిపోతుంటే, కెమెరాలకు కనపడకుండా చేతిని వేసారో ఏమో గానీ, నిర్మాత లూకా చేసిన పనిని డకోటా ఏ మాత్రం అడ్డుకోపోగా చిరునవ్వులు చిందించింది.

అంతేకాక సిగ్గుపడిపోతూ సదరు నిర్మాత వెనక్కి జరిగి భుజం మీద వాలిపోయింది. ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డకోటా ప్రైవేట్ పార్ట్స్ ను కవర్ చేయడానికే నిర్మాత అలా చేయాల్సి వచ్చిందని కొందరు అంటుంటే, తనకు తొలి ఛాన్స్ ఇచ్చి స్టార్ హీరోయిన్ ను చేసిన నిర్మాతను ఏమి అనలేక డకోటా అలా చిరుదరహాసం పండించిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైతేనేం… గడిచిన మూడు, నాలుగు రోజులుగా ఈ ఫోటోలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.