Director Krish Wedding Card,Director Krish Wedding Invitation,Director Krish Prepares Wedding Card,Director Krish Wedding Card Photo,Director Krish Marriageప్రస్తుత టాలీవుడ్ దర్శకులలో క్రిష్ శైలి వినూత్నం. అందరికీ ఒక దారి అయితే… తానోక్కడిదే మరో దారి… అని తన సినిమాల ద్వారా చాటిచెప్తున్నాడు. కమర్షియల్ సినిమాను సామాజిక అంశాలతో ముడిపెట్టి ప్రేక్షకులను మెప్పించడమనేది సామాన్యమైన విషయం కాదు. కానీ, ‘గమ్యం’ సినిమాతో అలా రీల్ లైఫ్ లో విజయబావుట ఎగురవేసిన క్రిష్, తాజాగా తన నిజజీవితంలో ‘రమ్యం’తో అడుగు పెట్టబోతున్నాడు.

తన సినిమాలలో పదునైన పదాలతో ప్రేక్షకులను కట్టిపడేసే క్రిష్, తన పెళ్లి శుభలేఖలో కూడా అంతే స్థాయిలో అక్షర ఆయుధాన్ని చూపించాడు. ఒక వివాహానికి ఇలా కూడా ఆహ్వానం పంపవచ్చా… అనే రీతిలో ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఈ శుభలేఖను రూపొందించడం వీక్షకులను మరింత కట్టిపడేస్తోంది. దీని ఫార్మాట్ ఒక ఆహ్వాన పత్రిక కంటే కూడా ఒక ‘లెటర్’ మాదిరి తయారు చేయడం క్రిష్ శైలికి అద్దం పడుతోంది.

విచ్చేసే అతిధులే దైవాలుగా వర్ణించిన ఈ లేఖలో తనకు నక్షత్రాలు, రాశుల యందు ఎంత నమ్మకం ఉందో కూడా చాటిచెప్పాడు. ఆగష్టు 7వ తేదీన గోల్కొండ రిసార్ట్ లో క్రిష్ ఆహ్వానం పలికిన దైవాల మధ్య వివాహ వేడుక అద్భుతంగా జరిగి… ఈ ‘గమ్యం’ దర్శకుడి జీవితం నిజంగానే ‘రమ్య’మనోహరంగా సాగాలని ఆశిద్దాం.