Director-Harish-Shankar-multi-starer-with-nani-and-sharwanand-!‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా హిట్టో, ఫట్టో అన్న సంగతి పక్కన పెడితే, ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కన్నా హరీష్ శంకర్ బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ‘డీజే’ కలెక్షన్స్ విషయంలో హరీష్ చేసిన కామెంట్స్ చిరు, పవన్ అభిమానులనే కాదు సాధారణ సినీ ప్రేక్షకులను కూడా బాగా ప్రభావితం చేసాయి. దీంతో హరీష్ శంకర్ అనే పేరు వివాదాస్పదంగా మారడంతో, తదుపరి సినిమా ఎవరితో చేస్తారా? అన్న ఆసక్తి నెలకొంది.

దానికి సమాధానమే “దాగుడు మూతలు” అని తెలుస్తోంది. ప్రస్తుతం ఏడు హిట్లతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని మరియు మినిమం గ్యారెంటీ నుండి హిట్ హీరోగా అవతరించిన శర్వానంద్ కాంభినేషన్ లో మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో కెరీర్ లో తొలిసారిగా ఓ మల్టీస్టారర్ కు దర్శకత్వం వహించబోతున్నారు హరీష్.

వరుసగా మూడు హిట్లతో దూసుకుపోతున్న బన్నీకి “డీజే” ద్వారా బ్రేక్ వేసిన హరీష్, హిట్లతో చెలరేగుతున్న నాని, శర్వానంద్ లకు బ్రేక్ లు వేస్తారా? అనే టాక్ హల్చల్ చేస్తోంది. కేవలం మూస కమర్షియల్ సినిమాలు తప్ప, కొత్తదనం కోసం పరితపించరు అన్న టాక్ ను సొంతం చేసుకున్న హరీష్, ఈ సినిమాతో అయినా దానిని రూపుమాపే విధంగా తెరకెక్కిస్తారా… టైటిల్ అయితే అలంటి సంకేతాలను ఏ మాత్రం ఇవ్వడం లేదు.