gunasekhar-daggubati-rana-hiranyakasipa-రుద్రమ్మ దేవి సినిమా తరువాత చాలా కాలం ఖాళీగా ఉన్న గుణశేఖర్ రానా హిరణాయకశ్యప ప్రీ-ప్రొడక్షన్ మీద దాదాపుగా రెండేళ్లు పని చేశాడు. ఈ సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఒకానొక కాస్టలీ చిత్రమని అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో మొదలుపెట్టాల్సి ఉండగా… చివరి నిముషంలో మొత్తం మారిపోయింది.

కరోనా కారణంగా మరో ఏడాది లేక రెండేళ్లు ఆర్ధిక మందగమనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ తరుణంలో ఇంత కాస్ట్లీ సినిమా మొదలుపెట్టడం రిస్క్ అని సురేష్ బాబు భావించి ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేశారట. దీనితో గుణశేఖర్ కథ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఆ సినిమా మొదలయ్యే లోగా ఒక వెబ్ సిరీస్ చెయ్యాలని నిర్ణయించుకున్నారట.

ఒక వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించి నిర్మించడానికి గుణశేఖర్ ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అది పూర్తయ్యి విడుదల అయ్యే సమయానికి హిరణాయకశ్యప సెట్స్ తీసుకుని వెళ్లొచ్చని గుణశేఖర్ అంచనా. ఆ వెబ్ సిరీస్ కు సంబందించిన స్క్రిప్ట్ పనులు కూడా తొందరలో మొదలుపెడతారట.

తెలుగులో ఇప్పటికే క్రిష్ కొన్ని వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి కూడా ఒక వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తెలుగు దర్శకులు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూడాలి వారి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో!