Pawan kalyan recommended director bobby to chiranjeevi‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా కోసం శరత్ మరార్ ఫోన్ చేసి పవన్ ను కలవమంటే ఆశ్చర్యం వేసిందని, ఆ తర్వాత పవన్ ను కలవడం, సినిమా ఒప్పుకోవడం అంతా ఒక కలలా గడిచిపోయిందని, ఏ విషయంలోనూ రాజీ పడని మనస్తత్వం పవన్ దని, దర్శకత్వం విభాగంలో పవన్ కల్పించుకున్నారన్న వార్తల్లో నిజం లేదని, తనకు పూర్తి స్వేఛ్చ ఇచ్చాడని ‘సర్ధార్’ సంగతులు చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబీ.

అయితే పవన్ ను భరించడం మాత్రం కష్టమేనని, అయితే ఒక్కసారి భరిస్తే వచ్చే కిక్కు వేరని, సాయంత్రం అయిపోయే సమయానికి చిన్న పిల్లాడిలా మారిపోయి చేసే సందడి అంతా ఇంతా కాదని, తానూ చిరంజీవి గారి అభిమాని అని తెలిసి.., బాబీతో ఒక సినిమా చేయి అన్నయ్య, బాగా డైరెక్ట్ చేస్తాడు అని చెప్పిన దాని కంటే గొప్ప విషయం ఏముంటుందని తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు బాబీ.

ఇక, పవన్ సినిమాల నుండి దూరమవుతానంటే, ఆయన ఇంటి ముందు ధర్నా చేసే మొదటి వ్యక్తిని తానే అవుతానని, తదుపరి సినిమాపై ఇంకా దృష్టి పెట్టలేదని, స్వతహాగా మాస్ కమర్షియల్ సినిమాలంటే తనకు ఇష్టమని, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెడతానని తన అనుభూతులను పంచుకున్నారు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దర్శకుడు