director-ar-murugadoss-accepts spyder negative talkచావు కబురు చల్లగా చెప్పినట్టుంది… “స్పైడర్” చిత్ర దర్శకుడు మురుగదాస్ వ్యాఖ్యలు. ఈ సినిమాకు తెలుగు నాట భారీ డివైడ్ టాక్ వ్యక్తం కాగా, తమిళనాట మాత్రం దీని కంటే మెరుగుగా ఉంది. అయితే ఈ డివైడ్ టాక్ వస్తుందని మురుగదాస్ అండ్ కోకు ముందే తెలుసా? ఏమో… తాజాగా మురుగా చెప్పిన క్లారిఫికేషన్ తో ‘స్పైడర్’ టాక్ ఇలా ఉంటుందని మురుగదాస్ ముందుగానే అంచనా వేసినట్లుగా తెలుస్తోంది.

తెలుగులో నెగటివ్ టాక్ వచ్చిన మాట వాస్తవమేనని, ఇక్కడ మహేష్ బాబు ఒక సూపర్ స్టార్ కాబట్టి, ప్రేక్షకులు ‘లార్జర్ దాన్ లైఫ్’ క్యారెక్టర్ ను కోరుకుంటారని, కానీ తమిళంలో అలా కాకపోవడంతో టాక్ బాగుందని చెప్పుకొచ్చారు. ఓవర్సీస్ లో గానీ, తెలుగులో గానీ మహేష్ నుండి హీరోయిజం ఆశిస్తారు, కానీ ‘స్పైడర్’లో మహేష్ చేసిన పాత్రకు ఆ స్కోప్ తక్కువ ఉంటుంది గనుక నెగటివ్ టాక్ వచ్చిందని సర్దిచెప్పుకున్నారు.

తెలుగులో మహేష్ బాబు ఓ ‘సూపర్ స్టార్’ అన్న సంగతి “స్పైడర్” విడుదలై నెగటివ్ టాక్ వచ్చిన తర్వాత గానీ, మురుగదాస్ గారికి తెలియలేదా? అంటూ మండిపడడం ప్రిన్స్ అభిమానుల వంతవుతోంది. స్టార్ హీరోల సినిమాలలో ‘హీరోయిజమే’ ఆశిస్తారు గానీ, ‘విలనిజం’ కాదన్న సంగతి తెలియడానికి దాదాపుగా 120 కోట్లు ఖర్చు పెట్టి “స్పైడర్” అనే సినిమా తీసి విడుదల చేస్తే గానీ మురుగకు బోధపడలేదా?