dilwale-mahesh-naniప్రిన్స్ మహేష్ బాబు, ప్రామిసింగ్ యాక్టర్ నాని కాంభినేషన్ లో ఓ మల్టీస్టారర్ సినిమా రూపుదిద్దుకుంది. రీమేక్ అంటే అయిష్టత వ్యక్తపరిచే మహేష్, ఈ సారి షారుక్ మెరిసిన పాత్రలో హల్చల్ చేసారు. మహేష్ కు జతగా కాజల్ నటించగా, నానికి జంటగా సమంత కనువిందు చేసింది. క్రిస్మస్ కానుకగా దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. నమ్మబుద్ది కాకపోతే ఈ క్రింద ట్రైలర్ వీక్షించాల్సిందే.

అవును… ఇటీవల షారుక్ నటించిన “దిల్ వాలే” సినిమాలో మహేష్ బాబు, నాని కలిసి నటిస్తే ఎలా ఉంటుందో అనే వినూత్నమైన ఆలోచన వచ్చిన ఓ అభిమాని మహేష్, నానిలు నటించిన సినిమాలలోని షాట్స్ ను తీసి “దిల్ వాలే” రీమిక్స్ ట్రైలర్ ను రూపొందించారు. ఈ వీడియోపై ఏకంగా నాని సైతం ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఇలాంటి వీడియోలను అభిమానులు రూపొందించడం సర్వ సాధారణమే అయినప్పటికీ, ఈ వీడియో ‘కటింగ్’ మాత్రం బాగా చేసారని నాని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఆ ట్రైలర్ మీ కోసం…