Dilip Sunkara on YouTube with the support of social media fansఒకప్పటి జనసేన నేత ఒకరు ప్రస్తుతానికి పార్టీలో లేకపోయిన ఆ పార్టీ సోషల్ మీడియా ఫ్యాన్స్ సపోర్ట్ తో యూట్యూబ్ లో జనసేన నేత గానే చలామణి అవుతున్నారు.తాజాగా ఆయన ఏబీఎన్ రాధాకృష్ణ మీద ఒక స్పూఫ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. పైకి రాధాకృష్ణను విమర్శిస్తున్నట్టుగా కనిపిస్తున్నా ఆ కార్యక్రమం టీడీపీ తో పాటు కొన్ని కులాలను టార్గెట్ చెయ్యడమే లక్ష్యంగా కనిపిస్తుంది.

తాజాగా ఆ కార్యక్రమంలో ఎన్టీ రామారావు మీద కూడా కొన్ని అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య యుద్దానికి దారితీసాయి. అయితే ఈ ఉదంతం పక్కన పెట్టినా సదరు వ్యక్తి వరుసగా పెట్టే వీడియోలు గమనిస్తే కొన్ని వర్గాలను జనసేనకు దూరం చేసే ప్రయత్నంగా కనిపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

“అతని తీరుని పరిశీలిస్తే ఆయన ఎప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పై గట్టిగా మాట్లాడారు. టీడీపీకి, జనసేనకు మధ్య అంతరం పెంచడం అలాగే…. కమ్మ కులంతో పాటు మరికొన్ని కులాలు జనసేన వైపుకు వెళ్లకుండా అధికార పార్టీకి లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఆయన ధోరణి అసలు కాపులతో గానీ, జనసేన పార్టీతో గానీ ఇతరులు ఎవరు పని చెయ్యలేరు అన్నట్టు మిగతా కులాల వారికి సంకేతాలు పెంచుతారు,” అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే ఇతని ధోరణి తెలిసి పార్టీ పక్కన పెట్టినా సోషల్ మీడియా పాపులారిటీ తో చలామణి అవుతున్నారని కొందరు జనసైనికులు కూడా అభిప్రాయపడుతున్నారు. దిలీప్ సుంకర వీడియోలకు వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూల మీడియా విస్తృత ప్రచారం కలిపించడమే ఇందుకు నిదర్శనం అని వారు అంటున్నారు.