dilip sunkara comments on perni naniసినిమాటోగ్రఫీ శాఖా మంత్రి పేర్ని నాని తనకు గురువు గారంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర తన వీడియోలలో కీర్తిస్తుంటారు. అలాగే మాటల్లో ‘అన్న’ అంటూ సంభాషిస్తూ పేర్ని నానిపై తన భావాలను పంచుకునే కళ్యాణ్, తాజాగా యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియోను పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసైనికులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

‘అన్న అన్న’ అంటూ సంభోదిస్తూనే పేర్ని నానిని ఓ ‘పాలేరు’గా అభివర్ణిస్తూ ఒక రేంజ్ లో విమర్శల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యల్లో చెప్పాలంటే… వైసీపీ భాషలో చెప్తేనే గానీ వారికి అర్ధం కావనే విధంగా, ఆ వైసీపీ భాషలోనే కళ్యాణ్ దిలీప్ సుంకర విమర్శలు ఉన్నాయి. అసలే ‘భీమ్లా నాయక్’ను నిలువరించిన ఆగ్రహంలో ఉన్న పవన్ ఫ్యాన్స్ కు ఈ వీడియో మాంచి పౌష్టిక ఆహారాన్ని అందించినట్లు కావడంతో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పని పాట లేకుండా పనికిమాలినోడి క్రింద తిరగడానికి అవకాశమున్నటువంటి మన నాని అన్న అంటూ ప్రారంభించిన కళ్యాణ్ దిలీప్ సుంకర వీడియోలో… పది రూపాయలకు, పదిహేను రూపాయలకు బాల్కనీ టికెట్లు అమ్మడం ఏంటిరా చిత్తకార్తి కుక్కల్లారా అని చంద్రబాబు, లోకేష్ లు అడగలేదు కదా, ఇదేమి దారుణం, ఏకపక్ష ధోరణి, కుటిల రాజకీయ నీతి అని అడిగారనుకో! దీనికి వెంటనే పవన్ కు – చంద్రబాబుకు లింక్ పెట్టేయాలని వైసీపీ చూస్తోందని అన్నారు.

మహేష్ బాబు నటించిన “శ్రీమంతుడు” సినిమాను చూసి చంద్రబాబు, లోకేష్ లు ట్వీట్ లు పెట్టారుగా, నీ కళ్ళు ఏమైనా కాకులెత్తుకెళ్లాయా? నీ కళ్ళు కొవ్వుతో మూసుకుపోయాయేమో అంటూ విమర్శించారు. వాళ్ళమో వాళ్ళ స్థాయి వ్యక్తుల గురించి పెడితే, మనమేమో మన స్థాయి వ్యక్తులు ఇంటికి కాఫీకి పిలిచారని స్నో ఫ్యామిలీతో అసోసియేట్ పిక్స్ పెడతాము, మబ్బు గాళ్ళం కాబట్టి ఇలాంటి ట్వీట్స్ కనపడవు మనకు అంటూ తీవ్రంగా నానిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు.

కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో నీకు నచ్చిన రెండు లైన్లు చదివి చెప్పడం కాదు, ‘మన ముఖం మీద ఛీ ఉమ్మేసింది’ అన్న విషయం కూడా చదివి చెప్పాలి కదా అన్నారు. మాట్లాడేటపుడు లీగల్ భాష మనకెందుకు, గౌతమ్ రెడ్డి చనిపోతే చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నాడా? అసలు శవ రాజకీయాలు అంటే ఏమిటో తెలుసా నీకు? అంటూ నాటి వైఎస్సార్ చనిపోయిన ఉదంతం నుండి ప్రస్తావించారు కళ్యాణ్.

తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి కుర్చీ కోసం మనం సంతకం సేకరిస్తే శవరాజకీయం అంటారు. మన బాబాయ్ మర్డర్ చేయబడగానే, హార్ట్ ఎటాక్ అని ఒకసారి, అధికార పార్టీ వాళ్ళు చంపించారని ఒకసారి, సిట్ తో విచారణ జరిపించాలని ఒకసారి, సీబీఐ రావాలని ఒకసారి, చివరికి సీబీఐ వచ్చాక పోపో అనే విధానాలు ఉంటే వాటిల్ని శవరాజకీయాలు అంటారు. మన కోడి కత్తి పెట్టుకుని మనమే పొడిపించేసుకుని, ఆ తర్వాత వాళ్ళని బెయిల్ మీద విడిపించేసుకుని, పార్టీలో ఏదొక రకంగా భిక్ష పెట్టించారనుకో వాటిల్ని శవరాజకీయాలు అంటారు.

శవరాజకీయాలు గురించి నువ్వు మాట్లాడొచ్చా నాని తప్పు కదా! ఇపుడు గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మీద అందరికి మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే అలీబాబా నలభై దొంగల లాంటి బ్యాచ్ తో టీమ్ అప్ అయ్యి కూడా ఏ రకమైన మచ్చ అంటించుకోకుండా, ఇలాంటి వాళ్ళతో తిరుగుతా ఇలా ఎలా ఉన్నరురా అసలు, మంత్రి పదవి ఇచ్చారు కదా అని భజన చేయకుండా, చిడతలు కొట్టకుండా, వివాదరహితుడిగా ఎలా ఉన్నాడు అని అందరం అంటాం.

గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయినా, ఆ భావోద్వేగం అందరిలో ఉన్నా, ప్రభుత్వం అనే దానికి వ్యత్యాసం తెలుసుకో. రాగద్వేషాలకు అతీతంగా, ఈతీబాధలకు అతీతంగా, సుఖఃదుఃఖాలకు అతీతంగా క్షణకాలం కూడా పాలన కుంటుపడకుండా నడపాలి అనేదే పాలనా విధానం, మనకు ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? మా మంత్రి చనిపోయాడు కాబట్టే జీవో ఇవ్వలేకపోవడాన్ని శవ రాజకీయాలు అంటారు, బాధ్యతల నుండి తప్పించుకోవడం అంటారు అంటూ మండిపడ్డారు.

“సమోసా రేట్లకు బాల్కనీ రేట్లకు అమ్మాలనే దరిద్రపు పరిస్థితులు కల్పించిన తర్వాత ఉదంతాలు, ఉపమానాలు చెప్పకూడదు, ఉప్మా ముఖం వేసుకుని నువ్వుని” అంటూ గోదావరి జిల్లా యాసలోని ఎటకారాన్ని ప్రదర్శించారు కళ్యాణ్ దిలీప్ సుంకర. ప్రభుత్వ అధికారులను, టీచర్లను తీసుకువచ్చి వైన్ షాప్ ల ముందు నిల్చోబెట్టారు, స్కూల్స్ కు పార్టీ రంగులు వేసే ఉదంతం ఎక్కడైనా ఉందా? దేశంలోనే వైసీపీ చేసే రాజకీయాలు ఎక్కడైనా ఉన్నాయా? అంటూ అధికార పార్టీ విధానాలను ఏకిపారేశారు.