Dilip Kumar admitted to Lilavati hospital in Mumbaiబాలీవుడ్ పాత తరం లెజండరీ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం నాడు అర్ధరాత్రి సమయంలో దిలీప్ కుమార్ ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.

గత కొంతకాలంగా న్యూమోనియాతో సతమతమవుతున్న దిలీప్ కుమార్ ఆరోగ్యం ఉన్నట్లుండి విషమంగా మారింది. సకాలంలోనే ఆసుపత్రికి చేరిన దిలీప్ కుమార్ కు లీలావతి ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందిస్తామని డాక్టర్లు వెల్లడించారు.