Krishnarjuna-Yuddham---It's-'Light'-Film-Assures-Dil-Rajuకొన్ని కొన్ని టైటిల్స్ విన్నప్పుడే… సినిమాపై ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం అలాంటి టైటిలే “సభకు నమస్కారం” పేరుతో హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ టైటిల్ తో ఓ సినిమాను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ముందుగా ఈ టైటిల్ తో నాచురల్ స్టార్ నానితో ఓ సినిమాను తీయాలని భావించినప్పటికీ, అది ఇప్పట్లో కార్యరూపం సిద్ధించేలా కనపడడం లేదట.

దీంతో “సభకు నమస్కారం” పెట్టే అవకాశం అల్లు అర్జున్ కు దక్కినట్లుగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కధ విన్న బన్నీ వెంటనే ఓకే చెప్పాడని, దీంతో త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. హీరోల విషయంలో ఈ రెండు పేర్లు హల్చల్ చేస్తుండగా, డైరెక్టర్ ఎవరన్న పేరు మాత్రం బయటకు రాలేదు.