dil raju boyapati srinuఇండస్ట్రీకి దిల్ రాజు పరిచయం చేసిన అనేక మంది దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. “భద్ర” సినిమా ద్వారా పరిచయం అయిన బోయపాటి, వరుస హిట్లతో క్రమంగా ఎదుగుతూ… ఆ తర్వాత అగ్ర దర్శకుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వం వహిస్తున్న “జయ జానకి నాయక” సినిమా ఆగష్టు 11వ తేదీన విడుదల కానున్న నేపధ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

అందులో భాగంగా చిత్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లతో కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో… సదరు మీడియా ప్రతినిధి ‘మీ మొదటి కారు ఏది?’ అని బోయపాటిని ప్రశ్నించగా, అందుకు ‘ఫోర్డ్ ఐకాన్’ అంటూ బదులిచ్చారు బోయపాటి. తన మొదటిసినిమా ‘భద్ర’ సినిమా హిట్టయిన తర్వాత నిర్మాత దిల్ రాజు గారు అందించిందిన బహుమతి ఈ కారు అని చెప్పిన బోయపాటి, తన తదుపరి కార్ల గురించి చెప్పారు.

దిల్ రాజు గారు ఇచ్చిన కారు ఎక్కువగా షెడ్ లోనే ఉండేదని చెప్పిన బోయపాటి, మళ్ళీ ఈ వ్యాఖ్య ఎలాంటి వివాదానికి దారి తీస్తుందోనని దానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఆ కారుకు మంచి ఇంజిన్ రాలేదని అందుకే షెడ్ లో ఉండేదని, ఆ తర్వాత ‘తులసి’ సమయంలో ‘స్క్వోడా’ను కొనుగోలు చేసానని, ప్రస్తుతం ‘ల్యాండ్ రోవర్’ కారు వాడుతున్నానని కాస్త గర్వంగానే చెప్పుకున్నారు బోయపాటి.