Director Shankar - Dil Rajuనిన్న హైదరాబాద్ పార్క్ హయత్ లో రోబో 2.0 టీమ్ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రెస్ మీట్ హడావిడి అంతా సినిమా ప్రమోషన్ లో భాగంగానే జరిగింది. ఇక ఈ వేదికపై మాట్లాడిన వారు అందరూ ఎవరికి వారు ఈ సినిమా గురించి కాస్త గట్టిగానే చెప్పారు. అయితే రజనీకాంత్ మాట్లాడిన తర్వాత ఆయన మాటల్లో ఏదో తెలియని ఆంతర్యం కనిపిస్తుంది అన్న డౌట్స్ మొదలయ్యాయి. రజని మాట్లాడుతూ మధ్యలో నిర్మాత ప్రసాద్ గారు అనవసరంగా ఈ సినిమాకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది నేను ఈ విషయం చెన్నైలోనే చెప్పాను అంటూ తెలిపారు.

అయితే ఈ సినిమా తమిళంలో, హిందీలో, ఇంకా దుబాయ్ లో కూడా పబ్లిసిటీలో పీక్స్ లో ఉంది. అయితే తలైవార్ కాబట్టి సినిమాకి గ్రాండ్ ఓపెనింగ్స్ వస్తాయి. ఇక వీకెండ్ కూడా సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. అందులో డౌట్ ఏమాత్రం లేదు, కాకపోతే తెలుగులో ఈ సినిమాని దాదాపుగా 82 కోట్లు పెట్టి కొన్నారు దిల్ రాజు మరియు ఎన్వీ ప్రసాద్ లు. మరి బ్రేక్ ఈవన్ అయ్యీ, వాళ్ళు సేఫ్ అవ్వాలి అంటే సినిమాకు ఆ రేంజ్ ప్రమోషన్ కావాల్సిందే. సామాజిక మధ్యమాల్లో ఊదర కొట్టడం షరా మామూలే కానీ, ఈ సినిమా కామన్ మ్యాన్ కి, ముఖ్యంగా మాస్ కి రీచ్ అవ్వాలి అంటే మాత్రం ఇదిగో ఇలా రజని లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పాల్సిందే.

పచ్చిగా మాట్లాడుకుంటే ఒక్క తెలుగులో మినహాయిస్తే మిగిలిన చోట్ల అంతా ఈ సినిమాకి భారీ పబ్లిసిటీనే చేస్తున్నారు. అయితే భారీ గ్ర్యాఫిక్ వర్క్స్ ఉండడంతో మాస్ ఏమాత్రం అటు ఇటూగా అయినా, కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది కనుక, నిర్మాతలు ఈ చిత్ర యూనిట్ ను హూటాహుటిన హైదరాబాద్ కి రప్పించి ప్రెస్ మీట్ ఇప్పించారు అని కాస్త నమ్మీ నమ్మనట్లుగా ఉన్నా నిజమే అనిపిస్తుంది. బహుశా ఆ సంధర్భాన్ని అనుసరించే రజని ప్రసాద్ గారు డబ్బు ఊరికినే వృధా చేస్తున్నారు అంటూ జోక్ చేశారు అనుకుంట.

మొత్తంగా చూస్తే కాస్త భారీ రేట్ కే కొన్నా, రజని కాంత్ పై నమ్మకం, శంకర్ క్రియేటివిటీపై భరోసాతో ఈ సినిమా రిలీజ్ కి సన్నాహాలు చేసేస్తున్నారు నిర్మాతలు.