Anushka Shetty - responds on rumours- (1)అనుష్క పెళ్లి అనేది మీడియాకి ఎప్పుడు ఇష్టమైన టాపికే. దీని మీద పుంకానుపుంఖాలుగా రాస్తూనే ఉంటారు. కొందరైతే మొన్న ఆ మధ్య ఏకంగా అనుష్క దిల్ రాజు ని పెళ్లి చేసుకోబోతుంది అని కూడా రాసేశారు. దిల్ రాజు సతీమణి 2017లో మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై అనుష్క ఇప్పుడు స్పందించింది.

“నేను పెళ్లి ఎప్పుడు చేసుకున్నా అది మా తల్లిదండ్రులు నిర్ణయించేదే. నేను ఎవరితోనూ ప్రేమలో లేను. ఇటువంటి వార్తలు మనసుకు చాలా బాధ కలిగిస్తాయి. మరోసారి చెబుతున్నా నేను అరేంజ్డ్ మ్యారేజ్ నే చేసుకుంటా. ఇక ఇటువంటి వార్తలు, పుకార్లు పుట్టించడం ఆపేస్తే మంచిది,” అని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే తన పెళ్లి ఎప్పుడు అనేదాని మీద మాత్రం ఆమె మరోసారి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తోంది. గత కొద్దిరోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 2న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. అంజలి, మాధవన్, శాలిని పాండే ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయిగా నటించింది. ప్రస్తుతానికి ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేదు. అయినా అనుష్క ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకుంది.