Diffrence between Chandrababu Naidu compared with YS Jagan and Pawan Kalyanతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. టీడీపీతో పొత్తు తరవాతనే కాంగ్రెస్ భాగ్యరేఖలు మారాయని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. లగడపాటి వంటి వారు ఇప్పటికే మహాకూటమి వైపే ప్రజల మొగ్గు ఉందని చెప్పేశారు. మహాకూటమి గెలిస్తే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణాలో తెలుగుదేశం భాగ్యరేఖలను మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే వెంటిలేటర్ మీద ఉన్న పార్టీకి ఊపిరి ఊదినట్టు అవుతుంది. అయితే ఇది ముందే ఊహించి తీసుకున్న నిర్ణయం కాదు.

లగడపాటి రాజగోపాల్ గతంలో తాను చెప్పిన విషయం ప్రకారం తెరాస పై చెయ్యి లో ఉండగా కాంగ్రెస్ తో కలిసి వెళ్ళడానికి సిద్ధం అయ్యారు చంద్రబాబు. ఇది ఎంతటి క్లిష్టమైన నిర్ణయమంటే కేసీఆర్ ఎల్లుండి ఎన్నికలలో గెలిస్తే టీడీపీని పూర్తిగా కబళించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా వేలు పెట్టడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలకు తెరాస అంగబలం, అర్ధబలం అందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరు బలమైన శత్రువులతో పోరాడుతున్న చంద్రబాబుకు కేసీఆర్ కూడా తోడవుతారు. కాబట్టి ఇది చాలా క్లిష్టమైన నిర్ణయం.

చాలా మంది టీడీపీని తెలంగాణ నుండి విరమించుకోవడానికి చంద్రబాబుపై గట్టిగా ఒత్తిడి చేశారు. స్వయంగా నేనే చంద్రబాబుకు పోటీ చెయ్యొద్దని చెప్పా అని కేటీఆర్ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని నమ్ముకుని చాలా మంది ఉన్నారని వారి కోసం పార్టీ పోటీ చెయ్యక తప్పదు అని తేల్చి చెప్పారని స్వయంగా కేటీఆర్ మీడియాకు చెప్పారు. దీనిబట్టే నమ్ముకున్న వారి కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ గెలిస్తే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోటీ నుండి పూర్తిగా విరమించుకున్నారు. తెలంగాణాలో పార్టీని నమ్ముకుని ఉన్న కొద్దోగొప్పో నాయకులను క్యాడర్ ను గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్ లోనే తమ భవిష్యత్తు అని తేల్చి చెప్పారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలైతే అయితే ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీలకు జరిగే లాభనష్టాలు బేరీజు వేసుకుని కనీసం పార్టీ స్టాండు ఏంటో చెప్పే ధైర్యం చెయ్యడం లేదు. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యాలని చెప్పి కర్రా విరక్కుండా పాము చావకుండా వ్యవహరించాయి.