Differences between YS jagan and KCR

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్-జగన్ మధ్య దూరం పెరిగినట్లుగా అనిపిస్తుంది. జగన్ ఏపీ సీఎం అయ్యాక.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మంచి సత్సంబంధాలు నెలకొన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వారి మధ్య అగాధం ఏర్పడినట్టుగా చెబుతున్నారు. 


ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారినట్లుగా తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రెస్ మీట్లలో కేసీఆర్ జగన్ మీద, ఆర్టీసీ విలీనం మీద చేస్తున్న కామెంట్లు ఆయనకు కోపం తెప్పించిందట. దానితో గోదావరి కృష్ణాలను కలిపే ఆంధ్రప్రదేశ్ తెలంగాణాల సంయుక్త ప్రాజెక్టును జగన్ అటకెక్కించారు. 


ప్రతిగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే పూర్తిగా ఉండే ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం చుట్టారు. అలాగే కొంతమంది తెలంగాణ అధికారులను అనధికారికంగా తీసుకోవడంపై కూడా కేసీఆర్‌కు కోపం పుట్టించనట్లుగా సమాచారం. జగన్ చేపడుతున్న వివిధ పథకాలు తెలంగాణాలో అమలు చెయ్యాలని కూడా కేసీఆర్ మీద ఒత్తిడి రావడంతో ఆయనకు చిరాకు రప్పిస్తుంది. 


తెలంగాణపై కొన్ని విషయాలలో ఆంధ్రప్రదేశ్ విభేదించి కేంద్రం వద్ద కంప్లయింట్ చేసింది. ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య స్నేహం దెబ్బతిన్నట్లుగా అధికార వర్గాలు అంటున్నాయి.  ఇద్దరి సీఎంల సఖ్యత వల్ల ఎన్నో పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయని అంతా భావించారు. ఇది గనుక నిజమైతే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.