JD-LakshmiNarayana-Pawan Kalyan--JanaSena-Party (1)జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతికి దన్నుగా అనేక ప్రకటనలు చేస్తున్నారు. తొందరలో బీజేపీతో పాటు ఒక లాంగ్ మార్చ్ కూడా చేపట్టడానికి సిద్దపడుతున్నారు. అయితే ఆ పార్టీలోని కీలక నేత జేడీ లక్ష్మీనారాయణ మాత్రం ఎందుకనో అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అనేదానిపై గట్టిగా మాట్లాడటం లేదు.

శుక్రవారం కందుకూరులో జరిగిన పదోతరగతి విద్యార్థుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… రాజధాని మార్పుపై రైతులు హైకోర్టులో ఫిల్ వేశారని, నిర్ణయం ఏంటనేది న్యాయ స్థానం తీర్పు ఇస్తుందన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకోవాలని లక్ష్మీ నారాయణ సూచించారు.

అలాగే శాసన మండలి రద్ధు చేస్తారంటు వస్తున్న వార్తలు నిజమైతే ఏపీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మంచి నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. చట్టాలను ఉపయోగించే అధికారం ఏపీ ప్రభుత్వ ప్రతినిధులకు ఉన్నప్పటికీ.. నియనిబంధనలు పాటించాలని కోరుకుంటున్నానని లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే…. పార్టీ స్టాండును జేడీ గట్టిగా చెప్పకుండా కోర్టులు చెబుతాయి అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ తో ఆయన విభేదిస్తున్నారా? లేక అమరావతి పై గట్టిగా మాట్లాడితే తాను పోటీ చేసిన విశాఖపట్నంలో వ్యతిరేకత రావొచ్చని ఆయన భయపడుతున్నారా?