Ram-Charan Birthday Celebrations“ఆర్ఆర్ఆర్”తో ధియేటర్లలో సందడి చేస్తోన్న రామ్ చరణ్ జన్మదినోత్సవం రెండు రోజుల క్రితమే జరిగింది. అభిమానులు ఏర్పాటు చేసుకున్న వేడుకలో పలు దర్శకులు పాల్గొని తమ అనుభూతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ సంస్కారం గురించి మెహర్ రమేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి గారిని ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని తీసుకురావాలని వి.వి.వినాయక్ గారికి అప్పగించి ఎంత పెద్ద హిట్ చేసారో మీ అందరికి తెలిసిన విషయమే. అలా సినిమా హిట్టయిన దాదాపు పది నెలల తర్వాత, ఒక రోజు తనకు కాల్ చేసి రమేష్ అన్నా… వినాయక్ గారు భోజనానికి ఇంటికి వస్తున్నారు, ఒకసారి రమ్మంటే వెళ్లానని అన్నారు.

చరణ్ కు తెలుగులో రాయడం సరిగా రాదు, కానీ తెలుగులో ఒక పేపర్ లో లెటర్ రాసి, నాన్నని ఇలా ప్రజెంట్ చేసి సూపర్ హిట్ చేసినందుకు గానూ వినాయక్ గారికి దండేసి, శాలువా కప్పి, ఆయన కాళ్లకు నమస్కారం చేసారు, అది చరణ్ బాబు సంస్కారం అంటే! అని మెహర్ రమేష్ చేసిన వ్యాఖ్యలను మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇదంతా నా సమక్షంలోనే జరిగిందని రమేష్ చెప్తూ, ఇది ఎవరో చెప్తేనో, డబ్బుతోనో వచ్చేది కాదు, చరణ్ మనసు అలాంటిది, ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, చరణ్ సంస్కారం అలాంటిది అని మెహర్ చేసిన వ్యాఖ్యలకు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లేటుగా బయటకు వచ్చిన ఈ వీడియోకు ఫిదా అవుతుండడం మెగా అభిమానుల వంతవుతోంది.