did ys jagan achieved on pawan kalyanపవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినిమాని వాయిదా చేసుకున్నారు నిర్మాతలు. అయితే ఆర్ఆర్ఆర్ కూడా విడుదల కాలేదు అది వేరే విషయం.

ఆ తరువాత భీమ్లా నాయక్ ని ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు, అయితే, ఈ చిత్రానికి మరో వాయిదా పడినట్లు కనిపిస్తోంది. అదే తేదీకి శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కూడా ప్రకటించారు.

ఏ విధంగానూ, శర్వానంద్ తన సినిమాని పవన్ కళ్యాణ్ సినిమాకు వ్యతిరేకంగా వెయ్యడు. అంటే భీమ్లా నాయక్ వాయిదా పడినట్లు చిత్ర బృందానికి నిర్దిష్ట సమాచారం ఉండవచ్చు. అది పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద నిరాశే.

అయితే అసలు భీమ్లా నాయక్ ఎందుకు వాయిదా పడినట్టు? దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ఢిల్లీ లాంటి చోట్ల కూడా 50% తో థియేటర్లు ఓపెన్ చేశారు. ఫిబ్రవరి 25 అంటే దాదాపు నెల రోజుల సమయం ఉంది.

అప్పటికి కరోనా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎందుకు సినిమా రిలీజ్ కాదు అంటే ఉన్న ఒకే ఒక్క అవకాశం ఏపీలో టిక్కెట్ల వ్యవహారం. ఆ సమస్య అప్పటికి కూడా కంట్రోల్ అవ్వదని చిత్రబృందానికి సమాచారం అందిందా?

దాని కోసమే సినిమా వాయిదా వేసుకున్నారా? ఒకవేళ అదే నిజమైతే పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టే విషయంలో జగన్ అనుకున్నది సాధించారా? అసలు ఈ గొడవ మొదలయ్యిందే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సమయంలో. ఆ తరువాత పరిశ్రమ మొత్తం ఇబ్బంది పడుతుంది.

అయితే ఇదే గనుక నిజమైతే కోర్టులు సీరియస్ గా తీసుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదు.