Did they hit RaghuRamaKrishna Raju so hardసుప్రీం కోర్టు నుండి ఇప్పటికే బెయిల్ పొందిన ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదలలో మాత్రం మరింత జాప్యం జరుగుతోంది. మరో నాలుగు రోజుల వరకు వేచి ఉండక తప్పదని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కోర్టు ఆదేశాలతో ష్యూరిటీస్ పిటిషన్ ట్రయల్ కోర్టులో వేశామన్నారు.

అయితే విడుదల ఉత్తరువులకు డిశ్చార్జ్ సమ్మరి కావాలని న్యాయమూర్తి అడిగారని, అయితే రఘురామకు మరో నాలుగు రోజుల ట్రీట్మెంట్ అవసరమని ఆర్మీ ఆసుపత్రి తెలపడంతో…. డిశ్చార్జ్ కావడానికి నాలుగు రోజులు సమయం పడుతుందన్నారు. నాలుగురోజుల తర్వాత మరోసారి సీఐడీ కోర్టులో ష్యూరిటీ పిటిషన్ వేస్తామని ఆయన అన్నారు.

ఆ మేరకు అప్పటి వరకు బెయిల్‌పై విడుదల వీలు అయ్యే అవకాశం లేదు. ఇక పోతే ఇప్పటికే రఘురామ ఆర్మీ హాస్పిటల్ లో ఇప్పటికే ఐదు రోజుల నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా నాలుగు రోజుల ట్రీట్మెంట్ అంటే రఘురామ కు సీఐడీ తగిలిన దెబ్బల తీవ్రతను సూచిస్తుందని ఆయన తరపు లాయర్లు అంటున్నారు.

ఇదే విషయాన్ని రేపు సుప్రీం కోర్టులో నివేదించి ఈ మొత్తం ఎపిసోడ్ పై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తామని వారు అంటున్నారు. దీనికి సంబంధించిన సీఐడీ వారిని, పోలీసులను, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మెడికల్ బోర్డు డాక్టర్లను శిక్షించే వరకు ఊరుకునేది లేదని ఆర్ఆర్ఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారట.