dictator breaks srimanthudu recordsఅభిమానాన్ని ప్రదర్శించడంలో ఒక్కో హీరో అభిమానులది ఒక్కో శైలి. పవన్ అభిమానులు అరిచి గోల చేస్తే, ప్రిన్స్ ఫ్యాన్స్ సైలెంట్ గా సందడి చేస్తుంటారు. అయితే నందమూరి అభిమానులది మాత్రం ఓ ప్రత్యేక శైలి అని నిరూపిస్తున్నారు. గతంలో నందమూరి నటసింహం బాలకృష్ణ “సింహా” సినిమా ఫస్ట్ టికెట్ ను దాదాపు ఒక లక్ష రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ రికార్డును ఇటీవల ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు “శ్రీమంతుడు” చిత్రం ద్వారా బద్ధలు కొట్టిన సంగతి సుపరిచితమే.

తాజాగా మరోసారి బాలయ్య బాబు సినిమా “డిక్టేటర్” విడుదల కానుండడంతో నందమూరి అభిమాన గణం హాట్ టాపిక్ అయ్యారు. ఈ సినిమా ఫస్ట్ టికెట్ ను ఓ అభిమాని 5,555 డాలర్స్ కు కొనుగోలు చేసి సరికొత్త రికార్డును అందిపుచ్చుకున్నారు. ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 3.60 లక్షల రూపాయలు పలికిన “డిక్టేటర్” సినిమా ‘యు/ఎ’ సర్టిఫికేట్ తో ఈ నెల 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలయ్య అభిమానుల సత్తా ఏమిటో తెలిసి వచ్చిందని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్సా… మజాకా..!