dhruva-was-last-remake-movie-by-surender-reddyడిసెంబర్ 9వ తేదీన మెగా వారసుడు రామ్ చరణ్ నటించిన “ధృవ” అంగరంగ వైభవంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తెల్లవారుజాము నుండే షోలను ప్రదర్శించేందుకు అభిమానులు, ధియేటర్ యాజమాన్యాలు సిద్ధమైపోతున్నాయి. ‘జనతా గ్యారేజ్’ వంటి భారీ విజయం తర్వాత “ధృవ” ద్వారా అభిమానుల ఫ్లెక్సీలతో ధియేటర్లు కళకళలాడుతున్నాయి. అందులోనూ పాజిటివ్ టాక్ తో విడుదల కానుండడంతో మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం ఉరకలేస్తోంది.

మరోవైపు చిత్ర యూనిట్ వర్గాలు ప్రమోషన్ కార్యక్రమాలలో నిమగ్నమయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు సినిమాలకు సంబంధించి ఓ స్పష్టమైన ప్రకటన చేసారు. తన దర్శకత్వంలో రూపొందబోయే చివరి చివరి సినిమా “ధృవ” అని ఖరారు చేసారు. అయితే రీమేక్ ల విషయంలో తానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సురేందర్ రెడ్డి తెలపడంతో నిర్మాతలు, సినీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

వరుస సక్సెస్ లతో మాంచి ఊపు మీదున్న ఉన్న సురేందర్ రెడ్డి, కెరీర్ లో తొలిసారిగా “తనిఒరువన్” రీమేక్ గా “ధృవ”కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇకపై తన కెరీర్ లో రీమేక్ చిత్రాలు ఉండబోవని, ‘ధృవ’నే తన చివరి సినిమా అని స్పష్టమైన ప్రకటన చేయడంతో… తన వద్దకు ఎలాంటి రీమేక్ సినిమాలు తీసుకురావద్దని సురేందర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ కూడా తొలుత సురేందర్ రెడ్డి ఈ సినిమాను అయిష్టంగానే ఒప్పుకున్నట్లుగా తెలిపారు.