Dhruva Teaser Ram Charanఈ నెల 9వ తేదీన నేరుగా మార్కెట్ లోకి విడుదల కాబోతున్న మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ నటించిన “ధృవ” సినిమా ఆడియో బైట్ ను చిత్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ విడుదల చేసింది. ‘నీతోనే డ్యాన్స్ టునైట్…’ అంటూ సాగే ఈ పాటలో మెగా అభిమానులకు కావలసినంత జోష్ మరియు డ్యాన్సింగ్ స్టెప్పులు ఉన్నాయి. కానీ, పాట వినడానికి మాత్రం ఓ డబ్బింగ్ సినిమా సాంగ్ లా అనిపించడంతో ఆడియో పరంగా ఎలా ఉంటుందో గానీ, విజువల్ గా చాలా గ్రాండ్ గా చిత్రీకరించినట్లు కనపడుతోంది.

పాట చివర్లో ఎగురుతూ రామ్ చరణ్ ఇచ్చిన హ్యాండ్ పంచ్ మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా మారింది. కండలు తిరిగిన చెర్రీ శారీరక ధారుడ్యం ఫ్యాన్స్ కు న్యూ లుక్ ను పంచుతోంది. ఈ సినిమాలో మెగా వారసుడి సిక్స్ ప్యాకో, ఎయిట్ ప్యాకో కనువిందు చేయడం ఖాయంగా కావడంతో, ధియేటర్లలో ఫ్యాన్స్ కూడా అంతే స్థాయిలో రచ్చ చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఇక, రకుల్ ప్రీత్ సింగ్ యధావిధిగా తన అందాలతో ఆకట్టుకుంది. ‘బ్రూస్ లీ’ తర్వాత వెంటనే రెండవ సినిమా చేయడంతో, ఈ సినిమాతో అయినా హిట్ పెయిర్ అనిపించుకుంటారేమో చూడాలి.