dhruva-ram-charan-rakul-preet-singh-movie-stills-social-media-2మెగా వారసుడు రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ధృవ” రిలీజ్ కు సిద్ధమైంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఈ సినిమా విడుదలపై అనేక పుకార్లు షికారు చేసిన నేపధ్యంలో… అవన్నీ పటాపంచలు చేస్తూ సినిమా విడుదల తేదీని డిసెంబర్ 9గా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. చెర్రీని సిల్వర్ స్క్రీన్ పై చూసి ఏడాది పైనే గడవడంతో… ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

దీనికి తగిన విధంగానే ఇప్పటివరకు విడుదలైన టీజర్, స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అందులో భాగంగానే మరో స్టిల్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ‘పరేషాన్’ అనే పాటలో రామ్ చరణ్ – రకుల్ మధ్య కెమిస్ట్రీకి నిదర్శనంగా ఈ స్టిల్ నిలుస్తోంది. హస్కీ సాగే ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలుగించడంలో సక్సెస్ కావడంతో, చిత్రీకరణ కూడా అంతే స్థాయిలో ఉంటుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగిన విధంగానే మాంచి రొమాంటిక్ గా ఈ సాంగ్ ను చిత్రీకరించారని ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది.

కండలు తిరిగిన చెర్రీ బాడీ కనపడే విధంగా స్లీవ్ లెస్ బనియన్ తో షర్ట్ లెస్ గా చెర్రీ కనపడుతుండగా, పొట్టి నిక్కర్లలో రకుల్ అందాల విందు చేసినట్లుగా కనపడుతోంది. అందులోనూ బీచ్ పక్కన చిత్రీకరించిన పాట కావడంతో, ఖచ్చితంగా అద్భుతంగా వచ్చి ఉంటుందని చెప్పవచ్చు. ఓ సాధారణ స్టిల్ ఈ రేంజ్ లో ఉంటే, సిల్వర్ స్క్రీన్ పైన వీరిద్దరి జంట కన్నుల విందు చేయడం ఖాయం అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ ఫోటో చూస్తుంటే… కాదనలేం మరి..!