dhruva-movie-team-ram-charan-arvind-swamy-out-from-usaసురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన “ధృవ” సినిమా ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. అంచనాలు వేసిన భారీ ఓపెనింగ్స్ రాబట్టలేకపోయినప్పటికీ, ప్రస్తుతం దేశంలో ఉన్న కరెన్సీ కరువు రీత్యా… రికార్డ్ రేంజ్ ఓపెనింగ్స్ కాకపోయినా, చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అందిపుచ్చుకుందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే ఏపీ, తెలంగాణాలలో ఈ ‘కరెన్సీ’ ప్రభావం ఉంటుందని భావించిన ‘ధృవ’ యూనిట్, ఓవర్సీస్ పై ఎక్కువగా ఫోకస్ చేసింది.

యుఎస్ కలెక్షన్స్ ను రికార్డ్ స్థాయిలో రాబడదామని భావించిన “ధృవ” చిత్ర యూనిట్ మొత్తం ప్రీమియర్ షోలకు స్వయంగా హాజరైంది. అయితే యుఎస్ లో కూడా అంచనాలను అందుకోలేకపోయింది. రికార్డు స్థాయి పక్కనపెడితే, కనీసం చెర్రీ కెరీర్ లో కూడా రికార్డులు సృష్టించలేకపోయింది. అయితే పాజిటివ్ టాక్, మంచి రివ్యూలు రావడంతో తొలి రెండు రోజుల్లో యుఎస్ బాక్సాఫీస్ కళకళలాడింది. ఇప్పటివరకు చెర్రీని ఊరిస్తూ వచ్చిన 1 మిలియన్ డాలర్ కలెక్షన్స్ మాత్రం “ధృవ” అందిపుచ్చుకునే సంకేతాలు కనపడుతున్నాయి.

దీంతో తమ లక్ష్యం పూర్తయ్యిందని భావించారో ఏమో గానీ, యుఎస్ నుండి “ధృవ” టీం అవుట్ అయ్యింది. ఇండియాకు తిరుగు పయనం అవుతూ ఫ్లైట్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి, అరవింద్ స్వామి, రామ్ చరణ్ తేజ కలిసి కెమెరాకు క్లిక్ మనిపించారు. “అనుకున్న లక్ష్యం నెరవేరింది… అందుకే తిరుగు పయనం అవుతున్నాం…” అన్నట్లుగా ఈ ఫోటోలో రామ్ చరణ్ ‘థమ్సప్’ సింబల్ చూపిస్తూ మెగా అభిమానులకు సంకేతాలు ఇచ్చారు. అయితే 1 మిలయన్ డాలర్స్ క్లబ్ లో చేరాలంటే దాదాపుగా 4 లక్షల డాలర్స్ వసూలు చేయాల్సి ఉంది.