Dhruva Movie Stills, Dhruva Ram Charan Stills, Dhruva Movie Ram Charan Tej Stills, Dhruva Movie Photo, Dhruva Movie Photos Leaked, Dhruva Movie New Stillsఅక్టోబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న సురేందర్ రెడ్డి – రామ్ చరణ్ ల ‘ధ్రువ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కన్నడ సినిమా ‘తని ఒరువన్’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

తాజాగా స్టంట్ కొరియోగ్రాఫర్ రవివర్మతో కలిసి రామ్ చరణ్ ఉన్న ఓ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఫుల్ షేవ్ లో చెర్రీ లుక్ అభిమానులను మెప్పిస్తుండగా, ‘జయహో, అఖిల్’ సినిమాల స్టంట్ కొరియోగ్రాఫర్ రవివర్మ ‘ధ్రువ’ సినిమాకు పని చేస్తుండడంతో, ఈ సినిమాలో ఫైట్స్ అదిరిపోతాయని అభిమానులు భావిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ఈవెంట్ లో అల్లు అరవింద్ ప్రసంగిస్తూ… ‘ధ్రువ’ సినిమా అద్భుతంగా వస్తోందని, పక్కా హిట్ అని చెప్పడంతో రానూ రానూ ‘ధ్రువ’పై అంచనాలు రెట్టింపవుతున్నాయి.